calender_icon.png 25 October, 2024 | 12:04 PM

తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

15-09-2024 01:47:44 PM

మందమర్రి, (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్ లు డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో,మార్కెట్ లోని విటి అబ్రహం స్తూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేయడం జరిగిందని, రావి నారాయణరెడ్డి సారధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గెరిల్లా  రక్షక దళాలుగా ఏర్పడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు  పంపిణీ చేసి మూడువేల గ్రామాలను విముక్తి చేయడం జరిగిందని రైతాంగ సాయుధ పోరాటాన్ని వారు గుర్తు చేశారు. కర్ణాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలంగాణలోని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని  అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు.బిజేపి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరిస్తుందని వారు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు  భీమనాథుని సుదర్శన్, బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సిపిఐ ఏఐటీయూసీ నాయకులు  బియ్యపు పద్మ,కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం,ఆర్ వెంకన్న గాండ్ల సంపత్,ఎలిగేటి వజ్ర, ఆంథోని,దినేష్ ,సిహెచ్ శర్మ కలవల శ్రీనివాస్,రాజేష్ యాదవ్,గోపతి సత్యనారాయణ, సాదుల సంపత్,మేకల సంపత్,రమాకాంత్,తాళ్లపల్లి వీరయ్య,ఎండి రసూల్,ఆర్ జనార్ధన్,టేకుమెట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య,మర్రి కుమార్,సుదర్శన్ రెడ్డి,వెల్ది ప్రభాకర్ ఎస్ కొండయ్యలు పాల్గొన్నారు