calender_icon.png 1 November, 2024 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం ఓటింగ్‌

13-05-2024 12:32:50 PM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజలు తమ ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా క్యూకట్టారు. ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో 26.99 శాతం, మెదక్‌లో 28.32 శాతం, నాగర్‌కర్నూల్‌లో 27.74 శాతం, నల్లగొండలో 31.21 శాతం, నిజామాబాద్‌లో 28.26 శాతం, పెద్దపల్లిలో 26.17 శాతం, వరంగల్‌లో 24.18 శాతం, జహీరాబాద్‌లో 31.83 శాతం ఓటింగ్‌ నమోదయింది. ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో 16.34 శాతం పోలింగ్‌ రికార్డు అయినట్లు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 11 గంటల వరకు లోక్‌సభకు 23.10 శాతం, అసెంబ్లీ ఎన్నికలకు 23 శాతం పోలింగ్ నమోదయింది. ఓటింగ్ లో 24.17 శాతం మహిళలు, 23.68 శాంతం పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.