calender_icon.png 24 December, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనం ఎత్తిన తెలంగాణ

20-07-2024 12:00:00 AM

మహానగరంలో మహంకాళికి బోనాలు

భాగ్యనగరంలో బల్కంపేట బోనాలు

బోనమెత్తిన భాగ్యనగరం

ఆషాఢంలో హైదరాబాదులో బోనాలు

డప్పులతో దరువుతో దండిగా పూజలు!!


సికింద్రాబాద్‌లో శివసత్తుల ఆట పాటలు

పసుపు కుంకుమతో తల్లికి పూజలు

గ్రామగ్రామాన ఘనంగా బోనాలు

సాకపెట్టి సంతోషంగా ఉండాలని

కోరే భక్తులు

బైండ్లల్లో ఆటపాటలు!!


తల్లికి పల్లె పల్లెనా పట్నాలు

సబ్బండ వర్గాలు జరుపుకునే పండుగ

పోతరాజుల కొరడాలు

తీన్మార్ దరువుల గనాలు

మహంకాళి బోనాలు!!

 దేవులపల్లి రమేశ్, 9963701294