హైదరాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరేడ్ మైదానంలో జాతీయజెండాను ఎగరవేసి.. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమర జవాన్ల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కే.లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొని పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు.