హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం అయ్యాయి. నేడు ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు సమయం రద్దు చేశారు. ఉదయం 10 గంటలకు రైతు భరోసాపై శాసనసభలో స్పల్పకాలిక చర్చ జరగనుంది. శనివారంనాడు శాసనమండలి ముందుకు నాలుగు సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మండలి ముందుకు జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సవరణ, పంచాయతీరాజ్ సవరణ, భూభారతి సవరణ బిల్లులు రానున్నాయి.