హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ మధ్యాహ్ననికి వాయిదా పడ్డింది. కేబినెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో సభ వాయిదా వేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Industries Minister Sridhar Babu) కోరారు. దీంతో సభ ప్రారంభమైన వేంటనే అసెంబ్లీని మధ్యహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. బీసీ కులగణన(BC Caste Census), ఎస్సీ వర్గీకరణ(SC Classification) అంశాలపై డెడికేషన్ కమిటీ నివేదికలు ఏకసభ్య న్యాయ కమిటీ(Single-Member Judicial Committee) కేబినెట్ ముందుకు ఉంచనుంది. ఈ అంశాలపై కేబినెట్ ఆమోదం తర్వాత శాసనసభలో చర్చిస్తారు. అనంతరం కులగణన, ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) మండలిలో ప్రకటన చేయనున్నారు.