- ఫిబ్రవరి 1 నుంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
- 4న కల్యాణోత్సవం
- 8న స్వామి వారి దివ్య రథోత్సవం, జాతర
పటాన్ చెరు, జనవరి 28 : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధ క్షేత్రంగా పేరుగాంచిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్స వాలకు ముస్తాబయ్యాడు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
తెలంగాణ కంచిగా పేరుగాంచిన కొడకంచి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణుడు కొలువుదీరారు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా విరాజిల్లుతున్నాడు. రాష్ట్ర రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడకంచి ఆదినారాయణ స్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకునేం దుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తారు.
ఆదినారాయణ స్వామి ఆలయానికి సుమారు వెయ్యి సంవ త్సరాల చరిత్ర ఉంది. ఆలయ పునర్ని ర్మాణం తర్వాత దినదినాభివృద్ధి చెందుతు న్నది. ప్రకృతి వాతావరణంలో స్వయంభు గా వెలిసిన ఆదినారాయణ స్వామి ఆలయం లో బంగారు వెండి బల్లులు ప్రత్యేకం. వీటిని స్పర్శిస్తే దోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ఆలయం ఎడమ పక్కన కోనేరు, ఎదుట చెరువు పంట పొలాలు ఆహ్లాద పరుస్తాయి.
బ్రహ్మోత్సవ వివరాలు
ఫిబ్రవరి 1, 2 తేదీలలో అధ్యయనోత్స వాలు, సాయంత్రం తొలకి సేవ పూజా కార్య క్రమాలు, 3వ తేదీ సోమవారం సాయంత్రం పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ట, 4వ తేదీ మంగళవారం శ్రీవారి ధ్వజ రోహణం, సాయంత్రం భేరి పూజ, రాత్రికి ఆదినారా యణ స్వామి కళ్యాణోత్సవం, అశ్వ వాహన సేవ, 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం హోమము, బలిహరణం రాత్రి హనుమంత సేవ, 6వ తేదీ గురువారం హోమము, గరుడ ప్రతిష్ట, గోష్టి రాత్రికి గరుడ వాహన సేవ, 7వ తేదీ శుక్రవారం హోమం బలిహ రణం, అమ్మవారి విమాన సేవ, స్వామివారి అలక సేవ, 8వ తేదీ శనివారం స్వామి వారి దివ్య రథోత్సవం ఊరేగింపు, జాతర, 9వ తేదీ ఆదివారం ఉదయం తోపు సేవ హో మంధ్వజ పట ఉద్వాసన, శ్రీ పుష్ప యాగం, స్వామి వారి ఏకాంత సేవ, 10వ తేదీ సోమవారం 16 పండగతో బ్రహ్మోత్సవాల ముగింపు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవా లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ అల్లాని రామాజీరావు తెలిపారు. ఆలయా నికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వాలంటీర్లు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తారన్నారు. జాతర రోజు పటాన్ చెరు నుంచి కొడకంచి వరకు ప్రత్యేకంగా బస్సులు ఉంటాయన్నారు.