హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగియనుండగా, అయితే జాబ్ క్యాలెండర్ ను రేపు అసెంబ్లీ ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హమీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, త్వరలోనే పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. పేదలకు విడివిడిగా తెల్లరేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినేట్ సబ్ కమిటీన్ని ఏర్పాటు చేసిందని పొంగులేటి అన్నారు. క్రీడాకారులు ఈసాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్ ల ముగ్గురికి 600 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.