బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): దేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వంగా తెలంగాణ సర్కార్ నిలిచిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. కేసీఆర్ ను విమర్శించడానికే సీఎం, మంత్రు లు పరిమితమైయ్యారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం పదవికున్న గౌరవాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నార ని, దీంతో ఆయన స్థాయి తగ్గిపోయిందని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ విపత్తులు వస్తే ఏవిధంగా ఎదుర్కొవాలో ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు.
విషజ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఇప్పటివరకు మంత్రులను, పీసీసీ చీప్ పదవిని భర్తీ చేసుకోలేకపోయారని విమర్శించారు. దేశంలో అత్యంత పెద్ద మోసం రెండు లక్షల రుణమాఫీ పథకమని ఆరోపించారు.