16-04-2025 12:32:34 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగా మిగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తొలిసారి ఫిలిప్పీన్స్ కు బి య్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధానం అనే అంశంపై మంగళవారం ఒకరోజు సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. మన దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అగ్రగా మిగా నిలిచిందని కొనియాడారు. ప్రస్తుత 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారుగా 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యం ఉత్పత్తి అయిందని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. రైతాంగానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, సన్న రకాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ తో పాటు ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వివరించారు.
రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన బియ్యం, అలాగే కేంద్ర నిల్వల కోసం సుమా రు 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పోగా, 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రంలో మిగులు ఉం టుందన్నారు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని ఫిలిప్పున్స్ కు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేయడాన్ని సదావకాశంగా తీసుకొని ఆ ప్రభుత్వంతో నేరుగా అవగాహన ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. వరి ఉత్పత్తిలో ఇటీవల రైతాంగంలో ఆదరణ పొందుతున్న నేరుగా విత్తె పద్ధతి( డి ఎస్ ఆర్) రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం( ఏ డబ్ల్యు డి), తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయ డంపై రైతులను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. ఫిలిప్పీన్స్ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని.. ఎన్నటికీ స్వయం సమృద్ధి సాధించే దేశం కాకపోవడంతో తెలంగాణ బియ్యానికి అనుకూలమై న మార్కెట్గా గుర్తించి ఆ దిశగా మార్చుకున్నట్లయితే తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వత పరిష్కారం దొరికినట్లేనని చెప్పారు.
అఖిలభారత రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి కృష్ణారావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, ఆపేడా అధికారులు, రైతు నాయకులు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పౌరసరఫరాల శా ఖ అధికారులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకు డాక్టర్ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు, వరల్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, ఇటీవల విశ్వవిద్యాలయం నియమించిన యుజిసి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డా క్టర్ సమరెండు మహంతి ఎగుమతుల విధా నం అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు.