calender_icon.png 29 December, 2024 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్

02-12-2024 06:24:48 PM

ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌గా ఉంచాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ లో మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, క్వింటా సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో పినపాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు.  అనంతరం పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే భోజనాన్ని వడ్డించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు,నియోజకవర్గ సెక్రటరీ వీరం సుధాకర్ రెడ్డి, మణుగూరు టౌన్ అధ్యక్షులు శివ సైదులు, సింగరేణి ఐఎన్టీయూఎసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.