calender_icon.png 21 April, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్

18-04-2025 12:00:00 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పడిపోతుం దని మాజీమంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన సీఏజీ మంత్లీ కీ ఇండికేటర్ల ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (ఎస్‌ఓటీఆర్) 2023 24లో రూ.1,24,146.19 కోట్లు కాగా, 2024 నాటికి 1,24,054.38 కోట్లకు చేరి, రూ.91.81 కోట్ల తగ్గుదల నమోదైందని శుక్రవారం ఎక్స్ వేదికగా వివరించారు. 2014 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ 12 శాతం సీఏజీ ఆర్‌తో సొంత పన్నుల ఆదాయ వృద్ధిని సాధించిందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలే రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయని ఆరోపించారు.