calender_icon.png 31 October, 2024 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో తెలంగాణ భాగం కాదా?

25-07-2024 01:03:32 AM

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, తెలంగాణపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణ భాగం కాదా? అని ప్రశ్నించారు. విభజన చట్టం రెండు రాష్ట్రాలకు ఒకటే అయినప్పుడు.. ఏపీకి ఒక విధంగా, తెలంగాణకు మరో విధంగా అమలు చేస్తారా? అని అడిగారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చకు ప్రతిపాదించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగించారు. న్యాయపరం గా తెలంగాణకు వచ్చే నిధుల్లోనూ అన్యా యం జరిగిందన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్‌లో ఒక్కసారి కూడా తెలంగాణ పేరు ప్రస్తావించక పోవడం శోచనీయమన్నారు. ఏపీ విభజన చట్టంలో 35 అంశాలు ఉంటే ఏ ఒక్క దానిపైనా బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. మరోసారి తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవ డానికి పాటుపాడాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. దేశంలోనే తెలంగాణ అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అని మంత్రి పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ లేకుండా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎలా అవుతుం దని నిలదీశారు.

హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్‌లో ఏపీకే లాభం

కేంద్రం బడ్జెట్‌లో హైదరాబాద్  ఇండస్ట్రీ కారిడార్‌ను ప్రటించిందని, కానీ దాని ఫలాలు తెలంగాణకు అందవని, అది ఏపీకి ప్రయోజనం చేకూరేలా ఉందని శీధర్‌బాబు దుయ్యబట్టారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపైనా కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేదన్నారు. కేంద్రం టూరిజానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని, ఇందులో బీహార్‌కు అధిక ప్రాధాన్యమిచ్చిందన్నారు. తెలంగాణలో అద్భుతమైన, చారి త్రక, అధ్యాత్మిక టూరిజం కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటి ప్రస్తావనే బడ్జెట్‌లో లేద న్నారు. గత పదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగిందన్నారు. పూర్ణోదయ స్కీమ్‌లో కొన్ని రాష్ట్రాలకే అవకాశం ఇచ్చారని, ఇలా అయితే వికసిత్ భారత్‌ను సాధించడం అసాధ్యమన్నారు. 

8 మంది ఎంపీలనిచ్చినా..

ఏపీలో ముగ్గురు బీజేపీ ఎంపీలు గెలి చి రాష్ట్రానికి భారీగా నిధులను తెచ్చారని, ఇక్కడ 8 మందిని గెలిపించినా బడ్జెట్‌లో అన్యాయం జరిగిందన్నారు. మోదీ సర్కా రు చిన్న చూపు కారణంగా కేంద్ర నిధులకు తెలంగాణ నోచులేకపోతుందన్నా రు. నీతిఆయోగ్ చెప్పిన నిధులను కూడా కేంద్రం కేటాయించలేదని శ్రీధర్‌బాబు విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు ఐఐఎం ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మెగా టెక్స్‌టైల్ పార్కు స్థాయిని తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

14వ ఫైనాన్స్ కమిషన్, జీఎస్టీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఎన్‌హెచ్‌ఎం, ట్రైబల్ వెల్ఫేర్, సివిల్ సప్లు, మిషన్ భగీరథ, విద్యుత్ బకాయిలపై కేంద్రం దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. రాష్ట్రంలో ఎన్‌ఐడీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని గత డిసెంబల్ 26న, ఈ ఏడాది మార్చి 2న, జూలై 4వ తేదీ మోదీని కలిసి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నా రు. హైదరాబాద్‌లో గొప్ప మెడికల్ ఎకో సిస్టమ్ ఉందని, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేదన్నారు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేని గుజరాత్, ఏపీకు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేశారని మండిపడ్డారు.