- అప్రతిష్ఠపాలు చేసేందుకే ప్రతిపక్షాల ప్రకటనలు
- తీవ్రంగా ఖండించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రీఫామ్స్ యాక్షన్ ప్లాన్)లో అత్యుత్తమ ప్రదర్శన చూపిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రకటనలు ఇస్తున్నారని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మం డిపడ్డారు. అత్యుత్తమ సాధకుల(టాప్ అచీవర్స్)గా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు ఆయన వెల్లడించా రు. ఈ నెల 5న కేంద్ర మంత్రి పీయూ ష్ గోయెల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల కమిషనర్ డాక్టర్ జి.మల్సూర్ అవార్డు అందుకున్న ఫొటో మీడియాలో కూడా వచ్చిందని తెలిపారు.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో మొత్తం 352 అంశాలను నూటికి నూరు శాతం అమలు చేసి జాబితాలో స్థానం సంపాదించినట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఏదో పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని.. రాష్ట్రం అవార్డులు తీసుకున్న జాబితాలోనే లేదనడం సరికాదన్నారు. అవార్డు సాధించేలా పని చేసిన పరిశ్రమల శాఖ అధికారులను అభినందించ్సాల్సిందిపోయి ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రతిపక్షాలకు హుందాతనం అనిపించుకోదన్నారు.
రైతులు బాగుపడుతుంటే ఏడుపెందుకు?
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్,సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రూ.2లక్షల రుణమాఫీతో రాష్ట్రంలోని రైతులందరూ సంతోషం గా ఉంటే బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు మింగుడుపడడం లేదని, అందుకే ఆయన దు:ఖంలో ఉన్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారన్న ఉక్రోశంతో ఆయ న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మామ ఫామ్‌హౌజ్‌లో, బామ్మర్ది అమెరికాలో జల్సాలు చేస్తుంటే హరీశ్ హైద రాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రైతు లపై అంత ప్రేమ ఉంటే కేసీఆర్‌తో హరీశ్‌రావు ఎందుకు ఒక ప్రకటన చేయించలేదన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను కేసీఆర్ ఎందుకు పరా మర్శించలేదని ప్రశ్నించారు. తాము రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నామన్నారు.