calender_icon.png 4 February, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం

04-02-2025 12:05:31 AM

  1. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 
  2. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా

జగిత్యాల, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలం గాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్’రెడ్డిలు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసి స్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిం చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అంటూ 62 లక్షల కోట్ల అప్పును 181 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసి ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ నిర్మాణం కోసం కేంద్రానికి రూ. 1 లక్ష 60 వేల కోట్ల ప్రతిపాదనలు పంపినప్పటికీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.

ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు అంటూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద   గతే డాది 30 వేల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 20 వేల కోట్లకు తగ్గించారన్నారు. ఇళ్ల నిర్మాణాలకు నిధులు తగ్గిస్తే అందరికీ ఇళ్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ర్ట విభజన హామీలైన బయ్యారం ఉక్కు కర్మాగా రం, ఐఐఎంల ఏర్పాటుకు ఎటువంటి చర్య లు చేపట్టలేదన్నారు.

రైల్వే కోచ్ కర్మాగారం ఏర్పాటు, మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ‘కల’గానే మిగిలిందన్నారు. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ెదా ప్రకటిం చాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు నిధుల కేటాయింపు లేదని, వరికి ప్రత్యా మ్నాయంగా మామిడి రైతులకు ప్రోత్సాహ కం కోసం మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఆర్మూర్ నుం డి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేయా లని, జాతీయ ఉపాధి హామి పథకానికి నిధులు పెంచాలని కోరారు. రైతులను రుణ విముక్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు పంట రుణ మాఫీ చేసి నా, కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయలేదన్నారు.

రుణ మాఫీ చేసిన తెలం గాణ రాష్ట్రానికి ప్రోత్సాహకంగా ఎటువంటి నిధులు కేటాయించలేదని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కష్ణారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణి నాయ కులు పాల్గొన్నారు.