calender_icon.png 6 November, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పిలుస్తోంది

15-08-2024 12:44:14 AM

  • కార్పొరేట్ లీడర్ తెలంగాణ

ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతోనే పోటీ

పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ఎంతో ప్రాధాన్యమున్న కంపెనీ కాగ్నిజెంట్

ఫ్యూచర్ సిటీ అభివృద్ధే మా చిత్తశుద్ధికి నిదర్శనం

కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయ క్రాంతి): అమెరికా, దక్షిణ కొరియాలో తాము కలిసిన వ్యాపారవేత్తలందరూ కార్పొరేట్ లీడర్స్‌గా ఉన్న తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సాను కూలంగా ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారం భించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అనుమతులు తాము కల్పిస్తామని తెలిపారు. 430 ఏళ్ల చరిత్ర హైదరాబాద్‌కు ఉందని, పాలకులతో సంబంధం లేకుం డా హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారగానే ఇక్కడి నుంచి పెట్టుబడులు తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించా రని, కానీ తన పోటీ ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో కాదని ప్రపంచంతోనేనని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కాగ్నిజెంట్ కంపెనీ తమ దగ్గర ఉందన్నారు.

కుతుబ్‌షాహీలు, నిజాంలు హైదరాబాద్‌ను నిర్మిస్తే, బ్రిటిషర్స్ సికింద్రాబాద్‌ను నిర్మించారని, 1992లో ఐటీ పరిశ్రమలకు నాటి సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేసినట్టు గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసి సైబరాబాద్‌ను నిర్మించారని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు తాము నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ నిర్మించాలకుంటున్నట్టు పేర్కొన్నారు. చైనా ప్లస్ 1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇతర దేశాలు ఎదురు చూస్తున్నాయని, వాటన్నింటి ప్రశ్నలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెబుతుందన్నారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్ధే నిరూపిస్తుందని వెల్లడించారు. 

త్వరలోనే మరిన్ని ఒప్పందాలు 

ఇటీవల పర్యటనలో తాము కలిసిన వ్యాపారవేత్తలందరూ పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపా రు. తమ పర్యటనల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయని, త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్యూచ ర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి మూడు రింగులున్నాయని, మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్, రెండోది సెమీ ఏరియా, మూడోది రీజినల్ రింగ్‌రోడ్డు బయట ఉన్న రూరల్ తెలంగాణ అని పేర్కొన్నారు. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడడం నుంచి ప్రపంచంతోనే పోటీ పడేందుకు తమ ఆలోచనను ఎప్పుడో విస్తరించుకున్నామని తెలిపారు. 

కాగ్నిజెంట్ విస్తరణకు మద్దతు  

కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందిందన్నారు. 2002లో హైదరాబాద్‌లో ప్రారంభమైన కాగ్నిజెంట్ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలోనూ కాగ్నిజెంట్ ప్రాంగణం ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. 

హైదరాబాద్ వైవిధ్యం

హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం మరెక్కడా లేదన్నారు. తమకు ప్రపంచంతోనే పోటీ అని, పక్క రాష్ట్రాలకు మనలాంటి నగరం, అవుటర్ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మంచి వాతావరణం లేవన్నారు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత, సంస్థలకు అవసరమైన యువశక్తి తెలంగాణలో ఉందని తెలిపారు. రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధానం ఉండాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం మారినా విధానాల్లో మార్పు లేదని, ఇంకా వేగంగా, పారదర్శకంగా, పట్టుదలతో తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తోస్తుందన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అనుమతులు తాము కల్పిస్తామని తెలిపారు. 

అందరి దృష్టి హైదరాబాద్‌పైనే..

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నా రని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఒక్క రోజులోనే ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందలేదని, 1992లో నా టి సీఎం ఐటీ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తే, తర్వాత పదేళ్లు పాలించిన మరోపార్టీకి చెందిన సీఎం, ఆ తర్వా త పాలించిన కాంగ్రెస్ సీఎంలు ఇక్క డ ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేశారు. దావోస్ పర్యటనలో తాము కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కాగ్ని జెంట్ అమెరికన్ ప్రెసి డెంట్, ఈవీసీ సూర్య గుమ్మడితో క్యాం పస్ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించామని తెలిపారు.

సీఎం పిలుపునకు స్పందించి ఆర్నెల్ల కాలంలోనే ఇక్కడ క్యాంపస్ విస్తరణ పూర్తి చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపం చం నేడు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాం టమ్ వంటి విభిన్న రకాల ప్రతిభను అన్వేషిస్తోందని, దానిపై సీఎం దృష్టి సారించా రని పేర్కొన్నారు. ఈ విషయంపై కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి మాట్లాడుతూ.. తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కీలకమైన హబ్ అని తెలిపారు. 2002 నుంచి కాగ్నిజెంట్ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్‌లో నూతన కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.