01-04-2025 02:33:30 AM
ముషీరాబాద్, మార్చి 31: (విజయక్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. ముస్లీం లు సంప్రదాయ దస్తులను ధరించి పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. నగరంలోనే అతిపెద్దదైన భోలక్ ప్పూర్ బడీ మసీదులో 10 వేల మందికి పైగా సామూహిక ప్రార్థనలు చేశారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, ఎడ్ల హరిబాబు యాదవ్, మాజీ కార్పొరేటర్లు వాజీద్ హుస్సేన్, అఖిల్ అహ్మద్, కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ తదితరులు ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బడీ మసీదు వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి, సీఐ రాంబాబు, ఎఐ లక్ష్మినారాయణ, చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ వీరేష్‌లు మసీదు వద్ద బందోబస్తు నిర్వహించారు. అదేవిధంగా మసీదు వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ముషీరాబాద్ మీడియా ఇన్చార్జి ముచ్చ కుర్తి ప్రభాకర్, నాయకులు వై. శ్రీనివాసరావు, సయ్యద్ అహ్మద్ భక్తి యార్, కొండా శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, అక్లక్ హుస్సేన్, శంకర్ గౌడ్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.