01-04-2025 02:37:18 AM
మేయర్ గద్వాల విజయలక్ష్మి
ముషీరాబాద్, మార్చి 31: (విజయక్రాంతి): మతసామరస్యానికి తెలంగాణ ఇతర రాష్ట్రాల కంటే ఆదర్శంగా నిలుస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకోని భోలక్ పూర్ డివిజన్ కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ ఇంటికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ ను కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ సన్మానించి, షీర్ కుర్మా అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం గంగా జమునా తెహజీబ్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు.