calender_icon.png 28 November, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

28-11-2024 02:45:04 AM

  1. ఏడాదిలో రూ.55వేల కోట్లతో పథకాల అమలు
  2. సకాలంలో రుణమాఫీ, రైతు భరోసా, బీమా
  3. వరి సాగులో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం
  4. మహబూబ్‌నగర్‌లో రైతు విజయోత్సవాలు
  5. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధం గా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం సం క్షేమ పథకాలను అమలు చేస్తోంది. కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.55వేలకోట్లతో ఎన్నో పథకాలను అంది స్తూ తెలంగాణ రైతాంగానికి అండగా నిలుస్తున్నది.

రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, రుణ విముక్తులను చేసేందుకు రుణమాఫీ, రైతు బీమా, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఏడాది కాలంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజులపాటు విజయోత్సవ పండుగను నిర్వ హిస్తోంది.

మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంగా నిర్వహించే ఈ సదస్సులో అన్ని జిల్లాల రైతులు పాలుపంచుకునేందుకు వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలన్నీ భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సదస్సులో 25 విభాగాల అధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వివిధ జిల్లాల నుంచి ఆదర్శ రైతులు, యూనివర్సిటీలు.. అనుబంధ శాఖలన్నీ ఈ సదస్సులో పాల్గొంటాయి.

27రోజుల్లో రూ.17,87౦కోట్ల రుణమాఫీ

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.54,280 కోట్లతో పథకాలను అ మలు చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణం లో తెలంగాణ టాప్‌లో నిలిచింది. 66.77 ల క్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 153లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులకు ఒకేసా రి రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసిన ఘనత ప్రభుత్వానికి దక్కింది.

27 రో జుల్లో 22.22 లక్షల మంది రైతులకు రూ.17, 870 కోట్ల రుణమాఫీ చేసింది. రైతులకు ఇ చ్చే ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది రూ. 10,444 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించింది. యాసంగి సాగుకు పెట్టుబడి సాయం గా రైతుభరోసా నిధులు..

ఎకరానికి రూ.5వే ల చొప్పున మొత్తం 69,86,519 రైతులకు సంబంధించిన 1,57,51,000 ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1,300 కోట్లు కేటాయించింది. రైతులు ఏ కారణం తో మరణించినా రూ.5లక్షల బీమా పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందిస్తోంది.

ధాన్యం కొనుగోలుకు రూ.10,547కోట్లు..

రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం గతానికంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లను ఏర్పాటు చేసింది. యాసంగికి సంబంధించి దాదాపు 9 లక్షల రైతుల నుంచి రూ.10,547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వానకాలం నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రైతునేస్తం పథకాన్ని అమలుచేసింది.

తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,601 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే ఏర్పాట్లు చేసింది. ఆయిల్ పామ్ కస్టమ్స్ సుంకం సంబంధించిన సమస్యలు పరిష్కరించటం ద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకు రూ.2వేలు అదనపు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారథ్యంలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.