14-04-2025 12:56:38 AM
ఖమ్మం, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి ):-సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పెద్ద సంఖ్య లో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన మధిర మండలం, మధిర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు.
సన్న బియ్యం పంపిణీ కీ అనూహ్య స్పందన
గత పాలకులు 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరి చేసుకుంటూఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్క డా వెనుకడుగు వేయడం లేదు అన్నారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పది సంవత్సరాలపాటు సన్న బి య్యం సంగీతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేద వర్గాలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదు అన్నారు.
సన్న బియ్యంతో తినాలని ఆశగా ఎదురు చూసే వారికి గత ఉగాది నుంచి రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు, 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇవే కాకుండా కొత్తగా రాబోతున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో ఒక కోటి రేషన్ కార్డు దారులకు, 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,525 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, అంకిత భావాన్ని ఈ పథకం తెలియజేస్తుందని అన్నారు. కనీ వినీ ఎరుగని గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తెలిపారు. గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి గింజను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలను ఈ సందర్భంగా కోరారు.
56 వేల ఉద్యోగాల భర్తీ
ఈ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు రైతు రుణమాఫీ కోసం 21 వేల కోట్లు, రైతు భరోసా కు 18 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా 2,675 కోట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం 12,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ఇవన్నీ చేపడుతూ తిరిగి పేదలకు సన్న బియ్యం అందించేందుకు 13,525 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఖమ్మం, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి ):-నిర్ణీత గడువులోగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివ ర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.ఆదివారం ఉప ముఖ్య మంత్రి, తన క్యాంపు కా ర్యాలయంలో మధిరలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర పట్టణంలో 128 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు స్పష్టమైన షెడ్యూల్ తయా రు చేసి, ఏప్రిల్ 16న హైదరాబాద్ లో జరిగే సమావేశంలో సమర్పించాలని తెలిపారు. యూ.జి.డి. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజినీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఎస్.ఈ. ఎన్. శ్రీనివాస్ రావు, మధిర మున్సిపాలిటీ డీఈఈ వై. నరేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మధిర లో ఉప ముఖ్యమంత్రి విస్తృత పర్యటన
ఖమ్మం, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి ):-మధిర నియోజకవర్గం లో ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.మధిర పట్టణంలో 128 కోట్ల రూపా యలతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ఈ సందర్బంగా భట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మధిర మండలం వంగవీడు గ్రామం నుంచి నక్కల గురువు గ్రామం వరకు 5 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మాణం చేయునున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వంగవీడు గ్రామంలో శంకుస్థాపన చేశారు.
అలాగే మధిర మండలం కృష్ణాపురం గ్రామం నుంచి భగవాన్లపురం గ్రామం వరకు 3కోట్ల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న బీటీ రోడ్డు పనులకు కృష్ణాపురం గ్రామంలో శంకుస్థాపన చేశారు.త రువాత మధిర మండలం ఆత్కూరు గ్రామం నుంచి పిల్లిగుట్ట గ్రామం వరకు 4కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆత్కూరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కా ర్యక్రమాల్లో స్థానిక పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.