calender_icon.png 23 November, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో అగ్రగామి తెలంగాణ

23-11-2024 03:35:18 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఆశించిన మార్పు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేంద్ర పథకాలతో గ్రామీణాభివృద్దిపై దృష్టి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, నవంబర్ 22 (విజయక్రాంతి): ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగా ణ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నల్లగొండలో శుక్రవారం ఎంపీ రఘువీర్‌రెడ్డి అధ్యక్షత నిర్వహించిన జిల్లా అభివృద్ది, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కోరుకున్న మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం వ్యవహరించిన అడ్డగోలు విధానాలతో రూ.50 వేల కోట్లు అప్పులు మిగిలాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌గా నిలించిందని వెల్లడించారు. ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారని తెలిపారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయం తెలియజేస్తే కేంద్రం నుంచి నిధు లు తీసుకొచ్చి అభివృద్దికి చర్యలు తీసుకుంటామన్నారు.

సమావేశంలో ఎంపీలు రఘు వీర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తు ల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, సామేల్, బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రం పరిశీలన 

ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు నిర్వాహకులను ఆదేశించా రు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. 17 శాతం వచ్చిన ధాన్యా న్ని వెంటనే కాంటా వేసి మిల్లులకు పం పాలని నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూ చించారు. మంత్రి వెంట కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులున్నారు.