calender_icon.png 4 February, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట

04-02-2025 12:00:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి... శివనగర్‌లో ఘనంగా మల్లన్న జాతర

పటాన్ చెరు, ఫిబ్రవరి 3: తెలంగాణ సంస్కృతి, సంప్ర దాయాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం   పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలో ని శివనగర్ గ్రామంలో సో మవారం జరిగిన మల్లికార్జు న స్వామి జాతరకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కళ్యాణ మహోత్సవం, జాతర ఉత్సవాల్లో మండల, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులతో, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ నిర్మల, మాజీ సర్పంచులు రేఖా కృష్ణ, పూజారి రాజు, జనార్దన్, ఆంజనేయులు, శివరాజ్, మాజీ ఎంపీటీసీ సంతోషి మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.