calender_icon.png 22 April, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

22-04-2025 10:43:04 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in, manabadi.co.in లో హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాపంగా ఈ ఏడాది మార్చి 5 నుంచి మార్చి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు  దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 

గత సంవత్సరం (2024) ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం పాస్ శాతం 60.01% కాగా, రెండో సంవత్సరం పాస్ శాతం 64.19%గా నమోదైంది. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బాలికల పాస్ శాతం 68.35%, బాలుర పాస్ శాతం 51.50%గా ఉంది. రంగారెడ్డి జిల్లా మొదటి సంవత్సరంలో, ములుగు జిల్లా రెండవ సంవత్సరంలో మంచి ఫలితాలు కనిపించాయి. ఈ ఫలితాలు విద్యార్థుల ఉన్నత విద్య, కెరీర్ ఎంపికలలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థులు తమ ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ అధికారులను సంప్రదించాలి. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పేరెంట్స్‌కి తోడుగా నిలవాలి.