calender_icon.png 27 December, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడి

05-11-2024 08:06:17 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. నవంబర్ 6 నుంచి 26 వరకు పబ్లిక్ ఎగ్జామ్ ఫీజుల చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్, ఓకేషనల్) హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు (కాలేజీ స్టడీ లేకుండా) ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూపులకు హాజరు కావడానికి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులకు రూ.520, ఫస్టియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.750, ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్డ్స్ విద్యార్థులకు రూ.520, జనరల్ సైన్స్ విద్యార్థులకు రూ.750, ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు రూ.750గా ఫీజు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రూ.100, డిసెంబర్ 5 నుంచి 11 వరకు రూ.500, డిసెంబర్ 12 నుంచి 18 వరకు 1000, డిసెంబర్ 19 నుంచి 27 వరకు 2000 అపరాధ రుసుంతో చెల్లించొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.