calender_icon.png 8 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పొడిగింపు

06-01-2025 08:29:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫీజు చెల్లించుకోలేని విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్(Telangana Inter Board) మరో అవకాశం కల్పించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల(Intermediate Annual Examination Fees) చెల్లింపు గడువును పొడిగిస్తూ టీజీబీఐఈ(TGBIE) ఉత్తర్వు జారీ చేసింది. రూ.2500 అపరాధ రుసుముతో ఈనెల 16 వరకు అవకాశం కల్పించింది. ఇంతకు ముందు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లింపు గడువును పొడగించిన విషయం తెలిసిందే. కాగా ఇది ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులతో పాటు, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు, ప్రైవేట్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్టు స్పష్టం చేసింది.