‘ఎండలు ఎప్పుడు తగ్గుముఖం పట్టి, వర్షాలు కురుస్తాయా’ అని కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కార్చిచ్చులతో అడవుల్లో వేలాది అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పంచాంగకర్తల లెక్కల ప్రకారం ఇప్పటికే వసంత ఋతు వులోకి ప్రవేశించాం. కానీ, ఆకులు రాలడం, కొత్త చిగుర్లు రావడం ఇంకా మొదలైనట్టే లేదు. మండే ఎండలకు కారణం మానవ తప్పిదాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతా వరణ మార్పుల నియంత్రణకు ప్రపంచ దేశాలు రాజకీయాలు వదిలిపెట్టి, కలిసికట్టుగా ముందడుగు వేయాలి.
హర్షిత్, నారపల్లి, మేడ్చల్ జిల్లా