calender_icon.png 23 December, 2024 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

23-12-2024 05:25:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కాగా, జల్ పల్లిలోని తన నివాసం వద్ద మోహన్ బాబు విలేకర్లపై దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ను కోరుతూ హైకోర్టులో పిటిషన్ ను పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ కేసుపై కోర్టు విచారించింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని, ఆయనకు గుండె, నరాల సమస్యలు ఉన్నాయని లాయర్ తెలిపారు. దీంతో మోహన్ బాబు అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో బెయిల్ ఇవ్వొద్దని ఏపీపీ వాదించారు. ఇరుపక్షల వాదనాలు విన్న హైకోర్టు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. మోహన్ బాబు విచారణకు హజరైనా రోజే బెయిల్ ఇచ్చేలా కింది కోర్టును ఆదేశించాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుతో పహడీషరీఫ్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.