హైదరాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శుక్రవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో నరేందర్ రెడ్డిని నేరస్తులతో కలిపి ఉంచారని, ఆయనను ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో నరేందర్ రెడ్డి పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం తిరస్కరించింది. లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై జరిగిన ఘటనలో ఏ1 నింధితుడినిగా ఉన్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో 14 రోజుల కస్టడీలో ఉన్నారు.