హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపి ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తిరస్కరించింది. జల్ పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్టుపై జరిగిన దాడి ఘటనపై పహడీషరీఫ్ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆదేశించారు. కాని, మోహన్ బాబు అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో మోహన్ బాబు కేసుపై హైకోర్టు కౌంటర్ దాఖలు చేయలని పోలీసులకు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.