calender_icon.png 18 April, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభపై విచారణ 17కు వాయిదా

11-04-2025 01:15:52 PM

వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు 

సభ అనుమతిపై ఈనెల 17న నిర్ణయం 

ప్రభుత్వ లాయర్ కు హైకోర్టు ఆదేశం

ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభ

అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు బీఆర్ఎస్

హైదరాబాద్: హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) సిల్వర్ జూబ్లీ సభకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు బీఆర్ఎస్ పిటిషన్ ను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభకు అనుమతించేలా పోలీసులకు ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి  10 గంటల వరకు సభ నిర్వహించనుట్లు బీఆర్ఎస్ తెలిపింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల(BRS Silver Jubilee Celebrations) సందర్భంగా సభ నిర్వహించనున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, వరంగల్ సీపీ, కాజీపేట ఏసీపీని ప్రతివాదులుగా బీఆర్ఎస్ పిటిషన్ లో చేర్చింది. ప్రతివాదులకు హైకోర్టు  నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈ నెల 21 వరకు సమయం ఇవ్వాలని హోంశాఖ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. సభకు పిటిషనర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 17 వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.