calender_icon.png 10 March, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద

10-03-2025 12:00:00 AM

భద్రాచలం, మార్చి 9 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆదివారం ఉదయం దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద. దేవాలయం వద్ద  ఈవో ఎల్ రమాదేవి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలకగా ప్రధాన ఆలయంలో సీతారామచంద్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయ ఆవరణలో వేద పండితులచే వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదం అందజేశారు. భద్రాచలం మెజిస్ట్రేట్ శివ నాయక్ భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటా దేవదానం పట్టణ ఎస్త్స్రలు విజయలక్ష్మి, మధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెజిస్ట్రేట్ కార్యాలయంలో సందర్శించి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి ఆవరణలో మొక్కలు నాటారు.