హైదరాబాద్: చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రహదారులపై వ్యార్థాల వల్లే కుక్కల స్వరవిహారం ఎక్కువైందని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించిన తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.