హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) శుక్రవారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President KTR) కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ(ACB) పిటిషన్ వేసింది. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఈ నెల 31 వరకు పొడిగించింది. ఫార్ములా-ఈ రేసు(Formula E race) కేసు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.