calender_icon.png 13 December, 2024 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట

13-12-2024 06:25:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో రిమాండ్‌లో ఉన్న ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై  హైకోర్టు విచారంచింది. అల్లు అర్జున్ న్యాయవాద బృందం చేసిన వాదనలను అంగీకరించిన కోర్టు అతనికి షరతులతో కూడిన నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చింది. చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ కు సొంత పూచీకత్తును సమర్పించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించారు. 

అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన ఘటన ఒక మహిళ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. నటుడి న్యాయవాద బృందం బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అతనికి నేరుగా విషాదంతో ముడిపడి ఉండటానికి తగిన సాక్ష్యాలు లేవని వాదించారు.  రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అర్నబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు అల్లు అర్జున్ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. అల్లు అర్జున్ దాఖాలు చేసిన క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పారు.