calender_icon.png 10 January, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ.. ప్రత్యేక షోలకు అనుమతులేంటీ..?

10-01-2025 02:35:46 PM

గేమ్ చేంజర్ టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో శుక్రవారం విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షోలు(Game Changer Benefit Shows) రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటి? అని కోర్టు ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని తెలంగాణ హోంశాఖ ప్రధాన కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. సినీ నిర్మాతాలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక షోలకు అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది.

తదుపరి విచారణను జనవరి 24వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) విడుదల సందర్భంగా డిసెంబర్ 4వ తేదీన ఆర్టీసీ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్ సుఖ్ నగర్ కు చెందిని రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చిత్ర పరిశ్రమపై సీఎం మాట్లాడారు. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలు ఉండవంటూ కీలక వ్యాఖ్యాలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప-2 ప్రిమియర్ షో వల్ల జరిగిన విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానన్నిఆయన స్పష్టం చేశారు.