calender_icon.png 11 February, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

10-02-2025 07:56:43 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డీఎస్సీ-2008 ఉద్యోగ నియామకాల విషయంలో విద్యాశాఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది. కోర్టు ఉత్తర్వులున్నప్పటికి అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది.  ఇప్పటికైనా స్పందించకపోతే కోర్టు ధిక్కారణగా భావించాల్సి వస్తుందని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు హెచ్చరించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషన్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. నియామక ప్రక్రియ చేపట్టామని, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, 1382 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని విద్యాశాఖ కమిషన్ వెల్లడించింది. దీంతో తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.