calender_icon.png 8 January, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు

07-01-2025 11:43:11 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 2023లో హైదరాబాద్ లో నిర్వాహించిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కుంభకోణం(Formula E-Car Race Scam)పై అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Department) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేశారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. ఆయనను ఏసీబీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఒక వారం పొడిగించి రక్షణ కల్పించాలన్న అతని తరపు న్యాయవాది అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. 

సోమవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో స్టేట్‌మెంట్‌ నమోదు చేసేందుకు వచ్చిన కేటీఆర్ తన లాయర్‌ను లోపలికి అనుమతించకపోవడంతో కార్యాలయం ఎదుట దాదాపు 45 నిమిషాల పాటు ఆయన న్యాయవాద బృందంతో వాహనంలోనే ఉండిపోయారు. ఏసీబీ అధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఇచ్చిన నోటీసుకు వాంగ్మూలం నమోదు చేయకుండానే తిరిగి తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు. ఫిబ్రవరి 2023లో ఫార్ములా-ఇ ఆర్గనైజర్స్ (ఎఫ్‌ఓఈ) అనే విదేశీ కంపెనీకి రూ.45 కోట్లను బదిలీ చేసిన ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ కేటీఆర్‌కు సమన్లు ​​జారీ చేసింది.