హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మాజీ మంత్రి కె.టి.రామారావు లంచ్ మోషన్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) అనుమతి ఇచ్చింది. ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ కేటీఆర్(KTR) పిటిషన్ వేశారు. కేటీఆర్ పిటిషన్ పై కోర్టులో మధ్యాహ్నం 2:30కి విచారణ జరగనుంది. రేపు విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పట్టుబట్టారు. హైకోర్టులో కేటీఆర్ తరుఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race) కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ విచారణ రావాలంటూ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది.