calender_icon.png 28 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ఐఐఎం ఇచ్చే అవకాశమే లేదు!

24-07-2024 01:11:24 AM

  • తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి ప్రధాన్

సీఎం రేవంత్‌కు లేఖ 

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు అవకాశమే లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం లేఖ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. 2015 తర్వాత దేశవ్యాప్తంగా 21 ఐఐఎంలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటికే ఏడు ఐఐఎంలను ప్రారంభించామన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇంగ్లిష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ (ఈఎఫ్‌ఎల్‌యూ), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఏంఏఎన్‌ఎన్‌యూ)ని కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్నదని, వీటితోపాటు రూ.890 కోట్ల వ్యయంతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఐఐఎం కేటాయించడం సాధ్యం కదని తేల్చిచెప్పారు.