calender_icon.png 12 March, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల

11-03-2025 04:32:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టుతో పాటు ఫైనల్ కీని కూడా ప్రకటించింది. టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా, ఓఎంఆర్ షీట్లు ఉంచారు. నారు వెంకట హర్షవర్ధన్ అనే అభ్యర్థి 447 మార్కులు సాధించి గ్రూప్-2 టాపర్ గా నిలిచారు. వడ్లకొండ సచిన్ 444 మార్కులతో రెండో ర్యాంకర్ గా, మూడో  ర్యాంకర్ గా మనోహర్ రావు 439 మార్కులు సాధించారు. గ్రూప్-2 ఫలితాల్లో తొలి 31 ర్యాంకులు పురుషులకే దక్కాయి. గ్రూప్-2 లోని 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో నోటీఫికేషన్ విడుదల కాగా, ఈ పరీక్ష 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.   గతేడాది డిసెంబర్  15, 16 తేదీల్లో మొత్తం నాలుగు పేపర్లుగా పరీక్ష నిర్వహించడం జరిగింది. పేపర్-1కు 2,57,981 మంది, పేపర్-2కు 2,55,490 మంది, పేపర్-3కి 2,51,738 మంది, పేపర్-4కు 2,51,486 మంది అభ్యర్థులు హాజరయ్యారు.