calender_icon.png 9 January, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 ప్రాథమిక 'కీ' విడుదల

08-01-2025 06:47:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రూప్-3 ప్రాథమిక 'కీ'ని టీజీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థుల పాథమిక 'కీ' వ్యక్తిగత లాగిన్లలో ఈనెల 12 అందుబాటులో ఉందని, కీ లో ఏమైన అభ్యంతరాలు ఉంటే సాయంత్రం 5 వరకు స్వీకరించడం జరుగుతుందని టీజీపీఎస్సీ చైర్మెన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు ఆంగ్లంలోనే అభ్యంతరాలు తెలపాలన్నారు. మరో రెండ్రోజుల్లో గ్రూప్-2 'కీ'ని విడుదల చేస్తుంది. మార్చి 31 లోపు తెలంగాణ సర్కార్ ఉద్యోగ ఖాళీల జాబితా ఇస్తే, మే 1 నుంచి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేస్తామని తెలిపారు.

ఖాళీల భర్తీపై ఏప్రిల్ లో కసరత్తు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూ ఉండే పోస్టులను సంవత్సరంలోపు, ఇంటర్వ్యూ లేని వాటిని 6-8 నెలల్లోనే ఉద్యోగ ఖాళీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులు టీజీపీఎస్సీ అపనమ్మకం, అపోహలు వీడాలని, నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పని చేస్తున్నామనిన్నారు. జనవరి 11,12వ తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు నిర్వహించి ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చిస్తామని టీజీపీఎస్సీ ఛైర్మెన్ బుర్రా వెంకటేశం తెలిపారు.