calender_icon.png 1 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల

30-03-2025 06:10:04 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఆదివారం ప్రకటించింది. గ్రూప్-1 అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్స్ తో పాటు మెయిన్స్ పరీక్ష మార్కుల మెమోలను డౌన్ లోడ్ కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటు ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలోని 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు జరిగిన గ్రూప్-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కులను మార్చి 10వ తేదీన విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ ప్రొవిజినల్ మార్కుల జాబితాను మార్చి 10 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు, అలాగే మార్కుల మెమోలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటు ఉంచినుంది.

మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ లలో టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  అలాగే జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు అందుబాటు ఉంటుంది. ఈ జాబితా ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తామని కమిషన్ తెలిపింది. ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే అభ్యర్థులు టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 040-23542185, 040-23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో సూచించింది.