ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రంగారెడ్డి,(విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చేపట్టే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్(Lakshmidevipally Reservoir) నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాసరత్తు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట బైపాస్ రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యం లో పార్టి నేతలు ఘన స్వాగతం పలికారు.
నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా షాద్ నగర్ లో ఆగారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ కార్యక్రమం త్వరలోనే కసరత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీనికోసం త్వరలోనే ఒక ప్రణాళిక కార్యాచరణ రూపొందించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందు అక్కడ పర్యటించిన సందర్భంగా తాను కూడా హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందుగా భూ సర్వే కోసం ఒక ప్రణాళిక రూపొందించాక తరువాత కార్యక్రమాలు మొదలవుతాయని స్పష్టం చేశారు.