calender_icon.png 11 October, 2024 | 8:54 PM

ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల

11-10-2024 06:31:00 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల హామీని నేరవేర్చే దిశాగా అడుగులు వేస్తోంది. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల లబ్ధిదారులను గుర్తిచేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రబుత్వం శుక్రవారం విడుదల చేసింది. పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల చేసిన ప్రభుత్వం సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్ పర్సన్ గా గ్రామస్థాయి కమిటీ, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా మున్సిపాలిటీ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి, వార్డు ఆఫీసర్, కమిటీలో ఇద్దరు మహిళా సంఘం సభ్యులు, ముగ్గురు స్థానికులను నియమించనుంది. లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్న ఇదిరమ్మ కమిటీలు అధికారులతో సమన్వయం చేయనున్నాయి. రేపటి వరకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీల కోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పేర్లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.