calender_icon.png 5 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణను మారుస్తాం: భట్టి విక్రమార్క

03-01-2025 01:27:46 PM

సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ శుక్రవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పర్యటించారు.  ఆయనకు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టరు క్రాంతి వల్లూరు(District Collector Kranthi Vallur), ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి(IIT Hyderabad Director B.S. Murthy) అనంతరం ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ హబ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి ఎంతో తోడ్పతాయన్నారు. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి కూడా సహాయ పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(New Clean and Green Energy Policy)ని ప్రతిపాదిస్తుందన్నారు. ఖనిజాల ఉత్పత్తి ద్వారా రెండు దేశాల మధ్య అభివృద్ధి అంశాలపై ప్రత్యేక స్టాళ్లను సిద్ధం చేసి ప్రదర్శించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి,  జిల్లా కలెక్టరు క్రాంతి వల్లూరు,ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.