calender_icon.png 31 October, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రతి రైతుకు రుణమాఫీ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు

31-07-2024 12:26:08 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంత్రి): లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు చేరి, రుణమాఫీ ఫలాలు మన జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు , రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు.  రైతులకు అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, మంథని పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు శశిభూషన్ కాచె, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.