calender_icon.png 12 January, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు శుభవార్త: రైతు భరోసా మార్గదర్శకాలు జారీ

12-01-2025 11:02:34 AM

రైతు భరోసా పథకం - మార్గదర్శకాలు 

రైతుభరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం "రైతుభరోసా" (Rythu Bharosa) పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రైతులకు అందించే ఆర్థికసాయాన్ని పెంచుతూ జనవరి 26 నుంచి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించేలా చేయడం, గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రతకు సహకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుభరోసా పథకం కింద ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు రూ. 12 వేలు చొప్పున పెట్టుబడి సాయం చేయనుంది. భూభారతి (DHARANI) పోర్టల్‌లో నమోదు చేయబడిన సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టా హోల్డర్లకు ఈ సహాయం అందించబడుతుంది.

సాగుకు యోగ్యం కాని భూములు రైతుభరోసా పథకం నుండి మినహాయించబడతాయి. ఆర్ఓఎఫ్ఆర్ ( Rights of Forest Dwelling Scheduled Tribes) పట్టాదారులకు కూడా పథకం నుండి ప్రయోజనం పొందేందుకు అర్హులు. ఆర్‌బిఐ నిర్వహించే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతి ద్వారా ఆర్థిక సహాయం నేరుగా రైతుల(Farmers) ఖాతాలకు జమ చేయబడుతుంది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ డైరెక్టర్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) IT భాగస్వామిగా పనిచేస్తూ పథకం అమలును పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో పథకం అమలుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత వహిస్తారు. వారి సంబంధిత ప్రాంతాల్లో తలెత్తే ఏవైనా ఫిర్యాదులను కూడా నిర్వహిస్తారు. రైతు భరోసా ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తెలుగులో జారీ చేసింది.