04-03-2025 03:21:44 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు, త్వరలో మిగిలిన సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బస్సుల కొనుగోలుకు మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీని రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీజీఆర్టీసీ ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దె చెల్లించనుంది. భారతదేశంలో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడం తొలిసారి. మహిళ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 బస్సులను లాంఛనంగా పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్, కరీంనగర్ రెండు జిల్లాల్లో మహిళ సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు.