calender_icon.png 5 February, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు

05-02-2025 01:57:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తాజాగా ఒక ఎకరం వరకు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి సాయం కింద  17.03 లక్షల లబ్దిదారుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు పథకాల అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు 32 జిల్లాలోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు తొలివిడతగా ఒక్కో ఎకరానికి 6 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించింది.  

ఇక భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం(Indiramma Atmiya Bharosa Scheme) కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. గణతంత్ర దినోత్సవంనాడు తొలి విడతగా మొదటి రోజు 18,180 కుటుంబాలకు రూ.6 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.10,91 కోట్లు విడుదల చేసింది.