calender_icon.png 22 February, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

22-02-2025 04:07:00 PM

హైదరాబాద్: మహిళాశిశు సంక్షేమశాఖలో కొలువుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల(Anganwadi teachers and helpers) ఖాళీల భర్తీకి శనివారం నాడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. కలెక్టర్లు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.